ఆందోళనకారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు! - Minnesota State Patrol news
🎬 Watch Now: Feature Video
అమెరికా ఫ్లోరిడాలో నిరసనలు చేస్తోన్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిసింది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడర్డేల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను చూసి వాహనాన్ని నిలిపాడు డ్రైవర్. ఈ నేపథ్యంలో అక్కడ నిరసన తెలుపుతున్న వారు డ్రైవర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓ నిరసనకారుడు చేసిన సంజ్ఞతో.. ఆగ్రహించిన డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ట్రక్కు పలువురికి తాకింది.