పెరూలో వ్యవసాయ కార్మికుల ఆగ్రహం -వాహనాలకు నిప్పు - దక్షిణ అమెరికా
🎬 Watch Now: Feature Video

డిమాండ్లను నెరవేర్చాలని పెరూలో వ్యవసాయ కార్మికులు రోడ్డెక్కారు. నిరసనలో భాగంగా పాన్అమెరికన్ రహదారిని దిగ్బంధించారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. నిరసనకారులు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. కనీస వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నది కార్మికుల డిమాండ్. రహదారి దిగ్బంధంతో వాహన రాకపోకలకు ముఖ్యంగా అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.