క్రిస్‌మస్ సంబరాలకు 'మాడ్రిడ్' ముస్తాబు
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.. క్రిస్‌మస్ సంబరాలకు ముస్తాబైంది. మాడ్రిడ్ వీధులు, కూడళ్లను ఎల్‌ఈడీ దీపాలు, స్పెయిన్ జాతీయ జెండాలతో అలంకరించారు. ఇందుకోసం ఏకంగా కోటి 8 లక్షల ఎల్‌ఈడీలను మాడ్రిడ్ సిటీ కౌన్సిల్ ఉపయోగించింది. అలంకరణకు గతేడాది కంటే ఎక్కువగా 3.17 మిలియన్ యూరోలను కేటాయించింది. కొవిడ్ తీవ్రతతో ఈ ఏడాది పండగల సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ మాడ్రిడ్‌లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 6 వరకు ఈ ఏర్పాట్లు ఇలాగే కొనసాగిస్తారు.