విజయోత్సాహంలో జారిపడ్డ దేశాధ్యక్షుడు - పుతిన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 11, 2019, 5:16 PM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కింద పడి పైకి లేచారు. ఏదో సీరియస్ రాజకీయ అంశం కాదండోయ్... అంతా ఆటలో భాగమే. ఏటా సంప్రదాయంగా నిర్వహించే మంచు హాకీ మ్యాచ్​లో పుతిన్ పాల్గొన్నారు. మంచు హాకీ మాజీ దిగ్గజ క్రీడాకారులకు పోటీగా బరిలోకి దిగారు. 14-7 తేడాతో విజయం సాధించి ఔరా! అనిపించారు. ఈ మ్యాచ్​లో 8 వ్యక్తిగత గోల్స్ సాధించారు పుతిన్. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కింద ఉన్న అడ్డంకిని గమనించక కిందపడిపోయారు. తిరిగి లేచి స్కేటింగ్​ చేయడం కొనసాగించారు పుతిన్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.