హాసెల్ అరెస్టుపై స్పెయిన్‌లో ఆందోళనలు - పాబ్లో హాసెల్ అరెస్టు
🎬 Watch Now: Feature Video
ర్యాప్ కళాకారుడు పాబ్లో హాసెల్ అరెస్ట్‌ను నిరసిస్తూ స్పెయిన్‌లోని ప్రధాన నగరాలైన మాడ్రిడ్, బార్సిలోనాలో అల్లర్లు చెలరేగాయి. రెండు రోజులుగా హాసెల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ హింసకు పాల్పడుతున్నారు. వాహనాల్ని తగలబెట్టారు. వందల సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి చేరటం వల్ల వారిని అదుపుచేసేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ తలెత్తింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. కొద్దిరోజుల క్రితం ర్యాప్ సింగర్ హాసెల్.. అక్కడి రాచరికాన్ని ప్రశ్నించడం సహా ఉగ్రవాదాన్ని కీర్తించారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.
TAGGED:
పాబ్లో హాసెల్ అరెస్టు