బద్ధలైన కిలౌయా అగ్నిపర్వతం- ఎగసిపడుతున్న లావా
🎬 Watch Now: Feature Video
ప్రపంచంలోని చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం(volcano eruption in hawaii 2021) మరోమారు బద్దలైంది. అమెరికా సముద్ర జలాల్లోని ఈ అగ్నిపర్వతం(volcano eruption) నుంచి భారీగా లావా ఎగసిపడుతోంది. అగ్నిపర్వత కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ధూళి కణాలు గాలిలో కలుస్తున్నాయి. అయితే కిలౌయా అగ్ని పర్వతం నుంచి లావా దిగువకు ప్రవహించటం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే నిపుణులు వెల్లడించారు. పైగా నివాస ప్రాంతాలకు అగ్నిపర్వత ప్రాంతం దూరంగా ఉండటంతో ప్రమాదం తప్పిందన్నారు. 2018లో కూడా ఇదే తరహాలో అగ్ని పర్వతం బద్దలు కాగా వందలాది ఇళ్లు పూర్తి ధ్వంసమయ్యాయి.