వైరల్: ఆకాశంలో గిరగిరా తిరిగిన మహిళ - spins
🎬 Watch Now: Feature Video
అమెరికా ఫీనిక్స్ అగ్నిమాపక విభాగం అధికారులకు అనుకోని ఘటన ఎదురైంది. ఫీనిక్స్ పర్వతంపైకి వెళ్లిన 74 ఏళ్ల వృద్ధురాలు గాయపడినట్లు సమాచారం అందింది. ఆమెను రక్షించేందుకు హెలికాప్టర్లో వెళ్లారు. స్ట్రెచర్‌లో ఎక్కించారు.
వృద్ధురాలిని హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్న క్రమంలో స్ట్రెచర్ వేగంగా తిరగటం ప్రారంభించింది. గిరగిరా తిరిగే సరికి అధికారులు స్ట్రెచర్‌ను కొంత మేర కిందకు దించారు. కొంత దూరం వరకూ అలాగే తీసుకెళ్లారు. తిరగటం ఆగాక హెలికాప్టర్లోకి వృద్ధురాలిని క్షేమంగా ఎక్కించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడా దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.