మెక్సికోలో పోలీసుకు నిప్పంటించిన నిరసనకారులు

By

Published : Jun 6, 2020, 3:46 PM IST

thumbnail
మెక్సికోలో మాస్క్​ ధరించలేదని ఓ యువకుడిని అరెస్ట్​ చేసి అతని మృతికి కారణమైన పోలీసులకు వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. స్థానికంగా వందలమంది రోడ్లపైకి వచ్చారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ పోలీసు అధికారిపై పెట్రోలు పోసి నిప్పంటించారు నిరసనకారులు. వెంటనే స్పందించిన మిగతా పోలీసులు మంటలను ఆర్పారు. ఈ ఘర్షణల్లో రెండు పోలీసులు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.