దూసుకొచ్చిన కారు.. మహిళా కానిస్టేబుల్ సాహసంతో విద్యార్థిని సేఫ్ - ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థిని కాపాడిన మేరీ ల్యాండ్ పోలీసు
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసు అధికారి తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ విద్యార్థిని కాపాడారు. నార్త్ ఈస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అన్నెట్ గుడ్‌ఇయర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ క్రాస్‌వాక్ వద్ద ఉండి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఇదే సమయంలో ఓ విద్యార్థిని రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకు రావడం కనిపెట్టిన మహిళా కానిస్టేబుల్.. వెంటనే ఆ విద్యార్థిని పక్కకు నెట్టివేసింది. దీంతో వేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. స్వల్ప గాయాలు కావడంతో గుడ్ఇయర్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విద్యార్థి ప్రాణాలు కాపాడినందుకు పోలీసు అధికారినిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
TAGGED:
police officer saves student