హగీబిస్ నుంచి తేరుకునేలోపే జపాన్లో మరో విపత్తు - జపాన్ వరదలు
🎬 Watch Now: Feature Video
రెండు వారాల క్రితం హగీబిస్ తుపాను ధాటికి అతలాకుతలమైన జపాన్ను ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున వానలు కురవటం వల్ల టోక్యోతో పాటు తూర్పున ఉన్న పట్టణాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్రమత్తమయిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.