12వ అంతస్తు నుంచి పడిన చిన్నారి- క్యాచ్ పట్టిన డ్రైవర్​ - వియత్నం బాలిక వైరల్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 3, 2021, 12:28 AM IST

వియత్నాంలో అధ్బుతం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారి 12 అంతస్తు నుంచి పడిపోతే.. అదే సమయంలో అక్కడి వచ్చిన డెలివరీ బాయ్​ కాపాడారు. బాల్కనీలో ఇనుప కమ్ములకు చిక్కుకున్న చిన్నారి.. కాసేపటి తర్వాత కిందకు పడిపోయింది. దీన్ని గమనించిన డెలీవరీ బాయ్​(డ్రైవర్​) చిన్నారిని క్యాచ్​ పట్టుకుని రక్షించారు. పాపని అసుపత్రికి తరలించారు. చిన్నారికి గాయాలయ్యాయని, అయితే ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. చిన్నారి కిందపడే దృశ్యాలను పక్క అపార్ట్​మెంట్​లో ఉండే వారు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.