బావిలో పడిన చిన్నారి- కాపాడిన 'వైట్ హెల్మెట్స్' - సిరియాలో సహాయక సిబ్బంది సాహసం
🎬 Watch Now: Feature Video
సిరియాలోని వైట్ హెల్మెట్స్ సహాయక బృందం.. ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది. తూర్పు అలెప్పో బాబ్ పట్టణంలోని ఓ నీళ్లు లేని బావిలో బాస్మా అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. ఆ బావిలో ఉన్న ఓ సొరంగంలో చిక్కుకుని చిన్నారి ఏడుస్తుండగా.. వైట్ హెల్మెట్స్ సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో బావిలోకి దిగి బాస్మాను బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో చిన్నారికి ఎలాంటి గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించారు.