ఇటలీలో అకస్మాత్తుగా ఏర్పడ్డ 66 అడుగుల గుంత - 66 అడుగుల లోతు భారీ గుంత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2021, 8:35 PM IST

Updated : Jan 8, 2021, 8:51 PM IST

ఇటలీ నేపుల్స్‌లోని ఒక ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో ఏర్పడిన భారీ గొయ్యి(సింక్‌హోల్) కలకలం సృష్టించింది. ఈ గుంత ఏర్పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆ ప్రాంతంలో నిలిపి ఉంచిన కార్లు గుంతలో పడిపోయాయి. 66 అడుగుల లోతు, 21,527 చదరపు అడుగుల వెడల్పుతో ఏర్పడిన ఈ సింక్‌హోల్ గురువారం ఏర్పడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల భారీగా కురిసిన వర్షాల ధాటికి నేల కుచించుకుపోయి ఈ గొయ్యి ఏర్పడి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Last Updated : Jan 8, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.