చైనాలో వరదలు.. భారీగా ఆస్తి నష్టం! - China floods June 2020
🎬 Watch Now: Feature Video

చైనాలో వరదలు పోటెత్తాయి. ఆగ్నేయ చైనాలో మొదలైన ఈ వరదలు.. గ్వాంగ్జీ, హునాన్, గ్వాంగ్డాంగ్, దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 20.6 లక్షలమందిపై తీవ్ర ప్రభావం చూపాయి. వెయ్యి మందికిపైగా ఆవాసం కోల్పోగా.. సుమారు 56.50 కోట్ల యూఎస్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.