ఆస్ట్రేలియా కార్చిచ్చు: అడిలైడ్‌కు వ్యాపించిన మంటలు - fire accident in austraia
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలో మరో రెండు ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించింది. తాజాగా అడిలైడ్ పర్వతాలు, యాంగిల్ వాలే ప్రాంతాలకు అగ్నికీలలు వ్యాపించాయి. అగ్నిమాపక అధికారులు స్థానికులకు ప్రమాదక హెచ్చరికలను జారీ చేశారు. 36 అగ్నిమాపక యంత్రాలు, విమానాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కార్చిచ్చు వల్ల ఆస్ట్రేలియా వ్యాప్తంగా 74 లక్షల ఎకరాల భూమి అగ్నికి ఆహుతయింది. ఆరుగురు పౌరులు మరణించారు. 800 ఇళ్లు దగ్ధమయ్యాయి.