బుల్లి గొరిల్లాను తల్లి ఏం చేసిందో చూడండి! - గొరిల్లా న్యూస్
🎬 Watch Now: Feature Video

అమ్మతనంలో ఉండే ప్రేమ మనుషుల్లోనే కాదు... జంతువుల్లోనూ కనిపిస్తుందని మరో సారి రుజువైంది. అమెరికా న్యూ ఒర్లాన్స్‌లోని ఓ జూలో... టుమానీ అనే గొరిల్లా 4 రోజుల క్రితం జన్మనిచ్చిన ఓ బుల్లి గొరిల్లాను అక్కున చేర్చుకొని ముద్దు చేసిన తీరు, ఎంతో మురిపెంగా తన బిడ్డను కౌగిలించుకున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పిల్ల గొరిల్లాను లాలించే విధానంపై, టుమాని గర్భవతిగా ఉన్నప్పుడే, బొమ్మ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు జూ అధికారులు తెలిపారు.