కరోనా అంతం కోసం 'దెయ్యాల నృత్యం'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2021, 1:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తున్న వేళ.. ఆ మహమ్మారి ప్రపంచాన్ని విడిచి పోవాలంటూ.. వెనిజువెలాలోని ఓ తెగ ప్రజలు దెయ్యాల నృత్యం చేశారు. వీరు క్యాథలిక్ సంప్రదాయ భక్తులు కాగా.. చెడుపై మంచి సాధించిన రోజును గుర్తు చేసుకుంటూ 300ఏళ్లుగా ఏటా ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. గ్వాజిరా ప్రాంతంలోని అనేక తీర ప్రాంత పట్టణాల్లో ఈ వేడుక ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆఫ్రికా మూలాలున్న వీరు.. నజరీన్ పేరుతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. రంగురంగుల దుస్తులు ధరించి రోడ్లపైకి చేరి ఆడుతూ పాడుతూ వేడుకల్లో పాల్గొంటారు. వీరి ఆచారానికి 2012లో యునెస్కో వారసత్వ సాంస్కృతిక హోదా కల్పించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.