విద్యుత్ కాంతుల్లో చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ అదరహో! - విద్యుత్ వెలుగుల్లో చైనా స్ప్రింగ్ ఫెస్టివల్
🎬 Watch Now: Feature Video
కొవిడ్ నిబంధనల నడుమ స్ప్రింగ్ ఫెస్టివల్‌ను జరుపుకోవడానికి చైనా ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పండగను ఫిబ్రవరి 12న జరపనున్నారు. ఆ దేశమంతటా దుకాణాలు, మార్కెట్లలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ప్రత్యేక వంటకాలు, రంగురంగుల డిజైన్లను దుకాణ యజమానులు సిద్ధం చేస్తున్నారు. జిజియాంగ్ రాష్ట్రం హాంగ్జౌ నగరంలోని క్వింటాంగ్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దేశమంతటా ఆహార సరఫరాలు ఉండేవిధంగా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. బీజింగ్‌లో ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా నిత్యవసర వస్తువుల సరఫరా చేస్తున్నారు. వుహాన్ రెస్టారెంట్స్‌లలో ప్రజలు గుమికూడకుండ యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పండగకు ప్రజలు తమ సొంత గ్రామాలకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉన్నచోటనే పండగ జరుపుకునేలా ప్రోత్సహిస్తోంది.