Viral Video: పార్కులో సందర్శకులను హడలెత్తించిన పైథాన్ - కరోనా వైరస్
🎬 Watch Now: Feature Video
థాయ్‌లాండ్‌లో కరోనా ఆంక్షలను సడలించారు. దీంతో పార్కులో హాయిగా సేదతీరుదామనుకున్న బ్యాంకాక్ వాసులకు షాకిచ్చింది ఓ కొండచిలువ. బెంజసిరి పార్కులో గురువారం ఓ చెట్టుపై ఈ పైథాన్ కనిపించింది. పామును పట్టుకోవటానికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు పార్క్ నిర్వాహకులు. పైథాన్ వారి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపై నుంచి పక్కనే ఉన్న భవనంపైకి వెళ్లేందుకు ప్రయత్నింది. అగ్నిమాపక సిబ్బంది దానిని చాకచాక్యంగా పట్టుకుని ఓ సంచిలో వేసుకుని తీసుకెళ్లారు. ఈ పాము 3.5 మీటర్లు (11.5 అడుగులు) పొడవు.. 35 కిలోగ్రాముల (77 పౌండ్ల) బరువు ఉన్నట్లు వివరించారు.