లాక్‌డౌన్‌తో ఎడారులను తలపిస్తున్న నగరాలు - coronavirus pandemic news
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. జపాన్‌లోని టోక్యో సహా మరో 6 నగరాల్లో మే 6 వరకు అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో ఆయా నగరాలు నిర్మానుష్యంగా మారాయి. దక్షిణ ఆఫ్రికాలోని ప్రధాన పర్యటక నగరం కేప్‌టౌన్.. లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారింది. టేబుల్ మౌంటేయిన్, వైన్ల్యాండ్స్ ప్రాంతాలు పర్యటకులు లేక బోసిపోయాయి. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే అమెరికా న్యూజెర్సీలోని పలు ప్రాంతాలు కరోనా కారణంగా వెలవెబోతున్నాయి.