జూలో క్రిస్మస్ వేడుకలు.. జంతువులకు విందు - christmas celebration in zoo
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9954070-744-9954070-1608546571073.jpg)
ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ జంతుప్రదర్శనశాల నిర్వాహకులు ముందస్తు క్రిస్మస్ వేడుకలను విభిన్నంగా జరుతున్నారు. జంతువులకు పండుగ అనుభూతిని పంచుతూ.. తమ ప్రత్యేకతను చాటుతున్నారు. సిడ్నీలోని 'తరోంగా జూ' సిబ్బంది.. క్రిస్మస్ను పురస్కరించుకొని జంతువులకు ఇచ్చే ఆహారాన్ని 'హ్యాపీ క్రిస్మస్' అనే అక్షరాల్లో అమర్చి పెడుతున్నారు. వాటిని కొత్త ప్రదేశాల్లో ఉంచి ఆటలు ఆడిస్తున్నారు. జీరాఫీలకు ఆపిల్ పండ్లు, ఆఫ్రికన్ సింహాలకు శాంటా ట్రీలు అందిస్తున్నారు. ఇచ్చిన ఆహారాన్ని, వస్తువులను కనుగొనేందుకు.. వాటిపై లేపనాలను రాస్తున్నారు. ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు సిబ్బంది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను తమ జూలో ప్రత్యేకంగా చేయాలనే ఈ విధంగా చేశామని చెబుతున్నారు నిర్వాహకులు.