లైవ్ వీడియో: క్షణాల్లో పవర్ ప్లాంట్ నేలమట్టం - క్షణాల్లో వందేళ్ల నాటి పవర్ ప్లాంట్ నేలమట్టం
🎬 Watch Now: Feature Video
అమెరికా మిచిగాన్ రాష్ట్రం డెట్రోయిట్ నగరంలోని వందేళ్ల నాటి 'కానర్స్ క్రీక్ విద్యుత్తు కేంద్రాన్ని' క్షణాల్లో కూల్చివేశారు అధికారులు. ఈ ప్రాంతంలో జీప్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారీగా పేలుడు పదార్థాలను వినియోగించి నేలమట్టం చేశారు. డీటీఈ ఎనర్జీకి చెందిన ఈ ప్లాంట్ను 1915లో బొగ్గు ఆధారితంగా ప్రారంభించారు. తర్వాత సహజ వాయువుతో పని చేసే విధంగా అభివృద్ధి చేశారు. సుమారు వందేళ్ల పాటు సేవలందించిన ఈ విద్యుత్తు కేంద్రంలో.. 2008లో ఉత్పత్తిని నిలిపివేశారు.