మెక్సికో నుంచి స్వదేశం చేరిన 300 మంది భారతీయులు - Mexico latest news
🎬 Watch Now: Feature Video
అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించినందుకు మెక్సికో వెనక్కి పంపిన 3 వందల మందికి పైగా భారతీయులు.....స్వదేశం చేరుకున్నారు. డాలర్ల ఆర్జనపై ఆశతో అంతర్జాతీయ ఏజెంట్లకు వీరు ఒక్కొక్కరు 25లక్షల రూపాయల నుంచి 30లక్షల రూపాయలు చెల్లించి అక్రమంగా మెక్సికో చేరుకున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. విమాన టికెట్, భోజనం, వసతి వంటి ఏర్పాట్ల కోసం ఏజంట్లు ఈ మొత్తాన్ని వసూలు చేసి అమెరికాకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మెక్సికో ఇలా చర్యలు తీసుకుంటోంది.
TAGGED:
Mexico latest news