శ్వేతవర్ణంలో బద్రీనాథ్- ఆలయాన్ని కప్పేసిన మంచు - Lord Badri Vishal doors
🎬 Watch Now: Feature Video
Badrinath Snowfall: ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఆలయ పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ధామ్, హేమకుండ్ సాహెబ్ ప్రాంతాల్లో మంచువర్షం కురుస్తోంది. హిమపాతం కారణంగా బద్రీనాథ్‌లో ఎటు చూసినా.. ఆలయం శ్వేతవర్ణంతో కనువిందు చేస్తోంది. మే 8న బద్రీనాథ్ దేవాలయ తలుపులు తెరవనున్నారు. ఇప్పటికే చమోలీ జిల్లా స్థాయి అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్ పట్టి నుంచి బద్రీనాథ్ వైపు రోడ్డుపై ఉన్న మంచును తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST