ప్రతిధ్వని: రక్తమోడుతున్న రహదారులు.. ఘోర ప్రమాదాలకు కారణాలేంటి ? - telangana news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10640060-692-10640060-1613401653780.jpg)
దేశంలో ఏటా లక్షన్నర మందిని రోడ్డు ప్రమాదాలు కబళిస్తున్నాయి. 50లక్షల మంది వికలాంగులు అవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి. రోడ్ల నిర్మాణాల్లో లోపాలు, డ్రైవింగ్ శిక్షణ, లైసెన్సుల జారీలో అవకతవకలు.. ఇంతటి పెను విపత్తుకు కారణం అవుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన వ్యవస్థలు లోపభూయిష్టంగా తయారయ్యాయి. దీంతో ఏటా రహదారులపై లక్షలాది మంది ప్రయాణికులు, వాహనదారులు నిర్ధాక్షిణ్యంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ఘోర విపత్తుకు కారణాలేంటి ? ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలపై ఈ రోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.