విమానాశ్రయ భద్రతపై ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్ - National Security Week celebrations at Hyderabad
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్‌లో జాతీయ భద్రతా వారోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. భద్రత కోసం వారోత్సవాలు ఏటా మార్చి 4 నుంచి 10 వరకు జరుపుకుంటారు. జాతీయ భద్రత ప్రాముఖ్యతను తెలిపే సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఓ ఫ్లాష్ మాబ్నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది పిల్లలు పని భద్రత, విమానాశ్రయ భద్రతపై ఫ్లాష్ మాబ్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.