గోదావరి నది తీరాన జింకల సందడి చూద్దామా! - deers video
🎬 Watch Now: Feature Video
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకలు సందడి చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో... గోదావరి నదిని ఆనుకొని ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాల్లో జింకలు పరుగులు పెడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి నది వద్దకు వచ్చి దాహం తీర్చుకుని అక్కడే ఉన్న పచ్చికను ఆరగిస్తున్నాయి. అటుగా వెళ్లిన వారి మనసుకు జింకల సమూహం పట్టరాని ఆనందాన్ని కలిగిస్తోంది. గుంపులు గుంపులుగా నదీ తీరం వద్ద పరుగులు తీస్తూ... చేస్తున్న సందడి చూపరుల మనసులకు ఆహ్లాదం నింపుతోంది. ప్రతి ఏటా జింకలు వర్షాకాలం తర్వాత శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోకి వస్తాయి. నీళ్లు, గడ్డి పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కృష్ణ జింకలు సందడి చేస్తున్నాయి.