Godavari drone visuals: గోదారమ్మ శాంతించింది.. ప్రకృతి పులకించింది - flood flow decreased to bhadrachalam godavari
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12566922-71-12566922-1627199325264.jpg)
భద్రాచలంలో నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి(bhadrachalam godavari) ఈరోజు ఉదయం నుంచి శాంతించి క్రమంగా తగ్గుతూ వస్తోంది. నిన్న ఉదయం నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న రాత్రి 11 గంటలకు 48.6 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉదయం నుంచి ఇప్పటివరకు నాలుగు అడుగులు తగ్గి 44.30 వద్ద సాగుతోంది. ఈ క్రమంలో డ్రోన్(Godavari drone visuals) సహాయంతో తీసిన వీడియోలు గోదావరి అందాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి.