నా రెండో సినిమా కూడా దిల్ రాజుతోనే..: బలగం వేణు - బలగం వేణు ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18168041-thumbnail-16x9-venu.jpg)
తెలంగాణ కుటుంబాల్లో కనిపించే ప్రేమానురాగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు జబర్దస్త్ వేణు. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. దీంతో జబర్దస్త్ వేణును కాస్త బలగం వేణు అని పిలుస్తున్నారు అందరూ. ఈ సినిమా విడుదలై నెల రోజులు గడిచినా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పలు గ్రామాల్లో ఈ చిత్రాన్ని ప్రజలంతా సామూహికంగా చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లల్లో జరిగే వాస్తవాలను సమాజానికి తెలియజేసిన డైరెక్టర్ వేణును పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. బలగం చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు వేణు. దీనిని ఇంతలా ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన మొదటి చిత్రానికే అవార్డులు కూడా వస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. ఇది మున్ముందు ఆయన తీయబోయే సినిమాలపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తన తదుపరి చిత్రం కూడా దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందంటోన్న బలగం వేణుతో ఈటీవీ ముఖాముఖీ.