సమాజంలో మార్పు కోసమే అలా చేశా.. దానికోసం ఎంతో కష్టపడ్డాను : సిద్ధార్థ్ - సిద్దార్థ్ రానున్న 15 నెలల్లో 5 సినిమాలు
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 12, 2023, 3:41 PM IST
Siddharth Chinna Movie Review : 'చిన్నా' సినిమా విజయంతో తన లాంటి నటుడు తమకు కావాలని తెలుగు ప్రేక్షకులు గట్టిగా చెప్పారని సిద్ధార్థ్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు పరిస్థితులను ఆధారంగా భావోద్వేగానికి గురయ్యాయన్న సిద్ధార్థ్.... తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు తెలుగు మాట్లాడే ప్రతి ప్రేక్షకుడు తన చిత్రాన్ని చూడటమే గెలుపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సిద్ధార్థ్ ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నా చిత్రం ప్రేక్షకుల చప్పట్ల కోసం కాదని, సమాజంలో మార్పు కోసం నిర్మించానని తెలిపారు. రానున్న 15 నెలల్లో తన నుంచి 5 సినిమాలు రాబోతున్నట్లు పేర్కొన్న సిద్ధార్థ్(siddharth upcoming movies )... భారతీయుడు2 కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. 100 మంది కమలహాసన్ లో నటించిన అనుభూతి భారతీయుడు 2 ద్వారా కలిగిందని, ప్రేక్షకులు ఆ చిత్రం చూడటానికి 100 రకాల కారణాలుంటాయని సిద్ధార్థ్ ఆనందం వ్యక్తం చేశారు.