Shilpa Shetty Visit Shiridi Sai : 'సినిమా హిట్ అయ్యేలా చూడు సాయి!'.. శిర్డీ బాబాను దర్శించుకున్న శిల్పాశెట్టి - శిర్డీలో నటి శిల్పాశెట్టి సందడి
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2023, 2:49 PM IST
Shilpa Shetty Visit Shiridi Sai : బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి కుటుంబ సమేతంగా సోమవారం.. శిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆమె భర్త రాజ్‌కుంద్రాతో కలిసి.. సాయిబాబా సమాధిని సందర్శించి, మధ్యాహ్నం హారతికి హాజరయ్యారు. శిర్డీతో పాటు ద్వారకామాయి, గురుస్థాన్ ఆలయాన్ని కూడా శిల్పా దంపతులు సందర్శించారు. అనంతరం శిల్పాశెట్టి మీడియాతో మాట్లాడారు. "నేను సాయిబాబా భక్తురాలిని అని అందరికీ తెలుసు. బాబా ఆశీస్సుల కోసం తరచూ శిర్డీ వస్తుంటాను. ఇక నా భర్త రాజ్‌కుంద్రాతో కలిసి నిర్మించిన 'సుఖీ' చిత్రం సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ మూవీ పోస్టర్‌ను బాబా పాదాల వద్ద ఉంచి.. సినిమా మంచి విజయం సాధించాలని బాబాను కోరాను" అని శిల్పాశెట్టి అన్నారు. అలాగే మంగళవారం నుంచి 'సుఖీ' సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇక శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాను.. శిర్డీ సంస్థాన్ సంస్థాన్ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.