Ram Charan Siddhivinayak Temple : ముంబయిలో గ్లోబల్ స్టార్.. సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న రామ్ చరణ్ - ముంబయి సిద్ధి వినాయకుడిని సందర్శించిన రామ్ చరణ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19676381-thumbnail-16x9-ram-charan.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 4, 2023, 11:56 AM IST
Ram Charan Siddhivinayak Temple : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ముంబయిలో కనిపించారు. ప్రస్తుతం దర్శకుతు శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్న ఆయన.. బుధవారం ముంబయిలోని ప్రముఖ సిద్ధి వినాయక మందిరాన్ని సందర్శించారు. తాజాగా ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. ఇక రామ్ చరణ్ అక్కడికి వస్తున్నారని తెలుసుకుని కొందరు అభిమానులు ఆయన్ను చూసేందుకు వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త సందడి నెలకొంది. ఇక గుడి ఆవరణలో ఉన్న ఫ్యాన్స్‌ను పలకరించిన చరణ్.. అనంతరం స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయంలోని అర్చకులు రామ్ చరణ్‌ను అంగ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Chiranjeevi Celebrates Ganesh Chaturthi : తాజాగా రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా వినాయకచవితి పండగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చరణ్‌తో పాటు ఉపాసన చిన్నారి క్లీంకార పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ఓ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి పండగ చాలా స్పెషల్ అని ఆయన అన్నారు.
"అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి ప్రత్యేకత.. చిన్ని 'క్లీంకారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.