Kishan Reddy comments on Employment : 'అవినీతి, అక్రమాలకు అతీతంగా ఉపాధి కల్పించడమే లక్ష్యం ' - Kishan Reddy comments on Employment
🎬 Watch Now: Feature Video
Kishan Reddy comments on Employment : అవినీతి, అక్రమాల పైరవీలకు అతీతంగా ఉపాధి కల్పించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి మందిరంలో రోజ్గార్ మేళాకు ఆయన హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. దేశానికి సేవ చేసే భాగ్యాన్ని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు కల్పిస్తున్నారని వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గొప్ప విషయం అయినా, లక్ష్య సాధనలో అనేక సమస్యలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడం మరింత గొప్ప విషయమని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజులా మేళా ప్రతినెల కొనసాగుతుందని ప్రతి నిరుద్యోగితో తానే స్వయంగా మాట్లాడి ఉద్యోగ కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. దేశానికి సేవ చేసే భాగ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు కల్పిస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు.