ప్రతిధ్వని: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు అవసరం?
🎬 Watch Now: Feature Video
సామాన్యులకు ఆహారభద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలో అనేక కరువు కాటకాల్లో ప్రజల ఆకలిమంటలను తీర్చింది. అయితే ఈ వ్యవస్థ కొన్నాళ్లుగా అనేక సమస్యలు, సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుంది. సాధించిన ఫలితాలు అంకెల్లో ఘనంగానే కనిపిస్తున్నా... కాలే కడుపులు అసలు నిజాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చక్కదిద్దడం ఎలా? మరింత బలోపేతం చేసి, పేదల ఆహారభద్రతకు భరోసా కల్పించే మార్గాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.