ప్రతిధ్వని: మద్దతు ధరలేని పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందా? - రైతు పండిస్తున్న పంటలకు మద్ధతు ధర
🎬 Watch Now: Feature Video
కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతుధర రైతుల ఆశలు, అంచనాలను అందుకుందా? ప్రధాన పంట వరికి ఈసారి పెరిగింది అక్షరాలా క్వింటాల్‌కు 72 రూపాయలు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్ధేశంతో.. అన్ని పంటలపై పెట్టిన పెట్టుబడికి కనీసం 50శాతం అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్లు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కానీ రైతుల కష్టార్జితానికి న్యాయమైన ధర నిర్ణయించడంలో ప్రభుత్వానికి చేతులు రాలేదు... అన్నది రైతు సంఘాల ఆరోపణ. అసలు కేంద్రం ప్రకటించిన కనీస మద్ధతుధరలతో రైతులకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈసారి ఎంఎస్‌పీలో రైతుల పెట్టుబడి ఖర్చులు, ఆదాయాల అంచనాలు ప్రతిఫలిస్తున్నాయా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.