Prathidwani: కస్టమర్ డేటా రక్షణకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలేంటి?
🎬 Watch Now: Feature Video
ఆన్‌లైన్ స్పూఫింగ్. ఇది అసలైన వాటిని పోలిన నకిలీ యాప్స్ వల. డిజిటల్ మనీ లావాదేవీల వేదికలే లక్ష్యంగా సాగుతున్న సైబర్ మోసం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాదారులను ఏమార్చుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఘరానా దోపిడీ. యాప్‌లు, ప్రైవేట్ కాల్ సెంటర్ల నుంచి కాల్స్ చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు... స్పూఫింగ్ మాయగాళ్లు. క్రెడిట్ కార్డుల రుణపరిమితి పెంచుతామంటూ, కొత్తగా రుణాలిస్తామంటూ సామాన్యుల సొమ్ములు కాజేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న కొత్తరకం సైబర్ మోసం తీరుతెన్నులపై ఈరోజు ప్రతిధ్వని.