మాక్‌డ్రిల్: తీవ్రవాదుల దాడి.. రంగంలోకి ఆక్టోపస్ - telangana police news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10761922-137-10761922-1614176841901.jpg)
నిత్యం వందల మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారి... రహదారికి ఒక వైపు వినాయకుడి దేవాలయం... అకస్మాత్తుగా నలుగురు తీవ్రవాదులు ఆలయంలోకి చొరబడి... తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భయాందోళనలకు గురైన భక్తులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఆక్టోపస్ దళాలు.. ఆలయాన్ని చుట్టుముట్టాయి. గంట సేపట్లోనే తీవ్రవాదులను ఏరివేశాయి. మాక్‌డ్రిల్‌లో భాగంగా సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో ఆక్టోపస్ దళాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.