మందుబాబులను చితకబాదిన మహిళ - women fighting story at wine shop in hyderabad
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్లో ఓ మహిళ మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వారిని చితకబాదింది. కరోనా వల్ల ఆకలితో ఇబ్బంది పడుతుంటే మీకు మద్యం కావాలా.. అంటూ నిలదీసింది. భౌతిక దూరం పాటించకుండా వైరస్ వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. వరుసలో నిలబడ్డ వారందరినీ కర్రతో తరిమింది. ఈ క్రమంలో పోలీసులు అలా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.