నగరం నడిబొడ్డున కాలిబూడిదైన బస్సు.. అంతా క్షణాల్లోనే..! - Nagpur bus caught fire
🎬 Watch Now: Feature Video

Bus Caught Fire: మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని మెడికల్ చౌక్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న సిటీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాగ్‌పుర్‌లో నెల రోజుల్లోనే ఇలాంటి రెండు ఘటనలు జరగడం గమనార్హం. అయితే.. పట్టణంలో ఎండల తీవ్రత పెరిగింది. సరాసరిగా 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST