నడిరోడ్డుపై కర్రలతో కొట్టుకుని.. చివరికి - కర్ణాటకలో రోడ్డుపైనే ఇరువర్గాల ఘర్షణ
🎬 Watch Now: Feature Video
ఓ యువతిని ఈవ్ టీజింగ్ చేసిన ఘటన.. రెండు వర్గాల మధ్య భీకర దాడికి కారణమైంది. కర్ణాటకలోని శ్రీనివాసపుర్ నుంచి గౌణిపల్లికి వెళ్తున్న బస్సులో ఓ యువతిని ఏడిపించాడన్న కారణంతో కోలార్‌కు చెందిన బాబు అనే యువకుడిపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 4న జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న బాబు.. తాజాగా అదే బృందంపై తన వర్గంతో దాడికి పాల్పడ్డాడు. ఇరువర్గాలు నడిరోడ్డుపైనే కొట్టుకున్నాయి. ఈ ఘటనలో సదరు యువతితోపాటు ముగ్గురు మహిళలకు కూడా గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన గౌణిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.