గంగానది ఉద్ధృతితో నీట మునిగిన వారణాసి - గంగానది
🎬 Watch Now: Feature Video

ఉత్తర్ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదల కారణంగా వారణాసి జలమయమైంది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. బహుళ అంతస్తుల భవనాలు ముంపునకు గురయ్యాయి. పవిత్ర పుణ్య క్షేత్రమైన వారణాసిలో పలు ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. నిత్యావసర సరుకులు లభించక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బయటకు వెళ్లేందుకు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.
Last Updated : Oct 1, 2019, 7:52 AM IST