'హస్తంకు ఓటేయండి'.. భాజపా ప్రచారంలో సింథియా! - సింథియా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఓటు
🎬 Watch Now: Feature Video
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జోతిరాదిత్య సింథియా ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. భాజపా అభ్యర్థి తరపున మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పేరునూ ప్రస్తావించబోయి ఆగిపోయారు. అనంతరం తన పొరపాటును గ్రహించి భాజపాకు ఓటేయండి అని చెప్పుకొచ్చారు. ఇది విని పక్కన ఉన్న అభ్యర్థి చిరునవ్వులు చిందించారు.