కుక్కర్‌తో ఆవిరియంత్రం.. పోలీసుల వినూత్న ఆవిష్కరణ - కుక్కర్‌తో ఆవిరియంత్రం
🎬 Watch Now: Feature Video
కరోనా వేళ దిల్లీ- ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని గాజియాబాద్ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్‌తో తేలికపాటి ఆవిరియంత్రాన్ని తయారు చేశారు. తొలుత కుక్కర్‌కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు విజిల్ వచ్చిన ప్రతిసారి ఆవిరి పైపు ద్వారా బయటకు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా విజిల్ మోగిన ప్రతిసారి దాని ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఆవిరి పీల్చుకునే వెసులుబాటును కల్పించారు. ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా.. గాజియాబాద్ పోలీస్ స్టేషన్‌లోనే ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో దిల్లీలోని అన్ని స్టేషన్లకు విస్తరించనున్నట్లు చెప్పారు.