Viral Video: కెనాల్​ నుంచి పైకి వచ్చేందుకు గజరాజుల ఫీట్లు - ఏనుగులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 11, 2022, 7:33 AM IST

అడవి నుంచి వచ్చిన ఓ ఏనుగులు గుంపు.. సాగు నీటి కెనాల్​లోకి దిగింది. నీటిలో సేదతీరుతున్న గజరాజులను చూసిన కొందరు బిగ్గరగా అరవటం ప్రారంభించారు. దీంతో భయపడిన ఏనుగులు కాలువ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. కానీ, గట్లు సిమెంట్​వి కావటం వల్ల పలుమార్లు విఫలమయ్యాయి. కెనాల్​ నుంచి పైకి వచ్చేందుకు గజరాజులు చేసిన ప్రయత్నాలను తమ ఫోన్లలో బంధించారు స్థానికులు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి. ఈ సంఘటన కర్ణాటక మైసూర్​ జిల్లాలోని హునసురు తాలుకా నెల్లూరు పాలా గ్రామంలో జరిగింది. నాగరహోల్​ జాతీయ పార్క్​ నుంచి ఈ ఏనుగులు బయటకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.