'ఆహారం కోసం వచ్చింది... నరుల చేత చిక్కింది'

🎬 Watch Now: Feature Video

thumbnail
కృష్ణానది వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మొసలిని గ్రామస్తులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించిన ఘటన కర్ణాటక బెళగావి జిల్లాలో జరిగింది. వరద నీటిలో ఆహారం కోసం వెతుకతూ వచ్చిన మొసలి.. సతి గ్రామానికి చేరుకుంది. సమీప పొలంలో పనిచేస్తున్న కొందరికి వింత శబ్దాలు వినపడటం వల్ల ఆ ముసలిని గుర్తించారు. అనంతరం ఆ మొసలిని తాళ్లతో బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నిత్యం వరదల్లో కొట్టుకొస్తున్న పాములు, విషపూరిత క్రిమికీటకాలతో సమీప ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
Last Updated : Sep 30, 2019, 2:37 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.