హెలికాప్టర్ క్రాష్: పార్థివదేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం! - ఆర్మీ చాపర్ క్రాష్
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని కున్నూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని దిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూరు నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తుండగా గురువారం ఈ ప్రమాదం సంభవించింది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందు వెళుతున్న అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు.