ప్రేమించిందని బాలికను చావబాదిన తండ్రి, సోదరుడు - మధ్యప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఓ అబ్బాయిని ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురిని అమానుషంగా హింసించిన ఘటన మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాలికను తీవ్రంగా కొట్టడమే గాక.. చెట్టుకి వేలాడదీసి కర్రలతో చావబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రి, సోదరుడు, బంధువులను అరెస్టు చేశారు. ఆమెను వైద్య చికిత్సకు తరలించారు. అయితే తన కూతురు ప్రేమించిన వ్యక్తితో పదేపదే ఇంట్లోనుంచి వెళ్లిపోతుందని.. అందుకే శిక్షించినట్లు ఆమె తండ్రి చెప్పడం గమనార్హం.