రక్తం గడ్డకట్టే చలిలోనూ టీకా పంపిణీ.. సైన్యం సాయంతో.. - ఎల్ఓసీ ప్రాంతంలో టీకా పంపిణీ
🎬 Watch Now: Feature Video

Vaccination In Snow Storm: జమ్ముకశ్మీర్‌ను హిమపాతం వణికిస్తోంది. బారాముల్లా, రాంబన్ సహా అనేక జిల్లాల్లో భారీగా కురుస్తున్న మంచు వర్షానికి రోడ్లపై సెంటీమీటర్ల కొద్దీ మంచు పేరుకుపోయింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జమ్ముకశ్మీర్ ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు సైన్యం సాయంతో వెళుతున్న ఆరోగ్య కార్యకర్తలు.. అర్హులందరికీ టీకాలు అందిస్తున్నారు. మంచు వర్షం, సరైన రహదారులులేని కారణంగా ఆరోగ్య కార్యకర్తలు, సైనికులు కాలినడకనే ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. సైన్యం సాయం లేకుంటే సరిహద్దుల్లో తాము ఎక్కువ మందికి టీకాలు వేయడం సాధ్యపడేది కాదని బారాముల్లా బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ పర్వేజ్ మసూద్ చెప్పారు.