బ్యాగులో రూ.లక్ష నగదు.. ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు? - చెట్టుపై కోతులు
🎬 Watch Now: Feature Video
కోతులు చేసిన అల్లరి కారణంగా.. డబ్బులు పోగొట్టుకున్నారు ఓ న్యాయవాది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ రామ్పుర్లో జరిగింది. న్యాయవాది వినోద్ వద్ద రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ బ్యాగును తీసుకుని ఓ చెట్టు ఎక్కిన వానరం.. అందులో నుంచి రూ.50 వేల కట్టను తీసి కిందకు విసిరింది. అయితే ఇంకో రూ.50 వేల కట్టల నుంచి మాత్రం ఒక్కో నోటు తీసి, గాల్లోకి విసిరింది. దీంతో రూ.8,500 వరకు వినోద్ నష్టపోయారు. ఈ కోతి చేష్టలను గమనించి పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Last Updated : Sep 17, 2021, 7:55 PM IST