టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్ - టీకాలపై అవగాహన లేమి
🎬 Watch Now: Feature Video
కరోనా టీకా వేసేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆ బృందంపైకి ఇటుక రాయి పట్టుకుని దాడి చేసేందుకు సిద్ధమైన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని నస్రుల్లాగంజ్ తహసీల్ నిమ్మనా గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇంటింటికీ టీకా ప్రచారంలో భాగంగా టీకాలు తీసుకోని వ్యక్తిని పలకరించగా దుర్భాషలాడాడు. అంతేగాక వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.